- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి అప్పగించిన గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
- రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు శ్రీ లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శ్రీ బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన శ్రీ బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.