నేడు కర్నూలు జిల్లా వేదికగా రాష్ట్రానికి ₹13,400 కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ భారత ప్రధాని మోడీ వచ్చిన సంగతి తెలిసిందే… కర్నూలు, ఓర్వకల్లు విమానాశ్రయంలో మోడీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని PM మోడీ, AP CM చంద్రబాబు నాయుడు ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అలాగే మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన మోడీ…
అప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మోడీ గారు కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న విషయాన్ని, ట్విట్టర్ ద్వారా నెటిజన్స్ కి తెలియజెసారు…