ఈరోజు రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ కోర్ కమిటీ సమావేశం ఆల్వాల్‌లోని సత్య అపార్ట్మెంట్స్‌లో జరిగింది. సమావేశంలో రాబోయే అక్టోబర్ 13, 2025 (సోమవారం) న శాంతి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ లోత్కుంట శుభశ్రీ గార్డెన్స్ నుండి ప్రారంభమై ఆల్వాల్ తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో జిమ్ఖానా నుండి తూమ్కుంట వరకు ఉన్న అన్ని రాజీవ్ రహదారి ప్రాపర్టీ యజమానులు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ అధ్యక్షుడు తేలుకుంట సతీష్ గుప్త విజ్ఞప్తి చేశారు.
సమస్యల పరిష్కారం కోసం, మన ఏకతా బలం చూపించడానికి ఈ శాంతియుత నిరసన ర్యాలీని ఘనవిజయం చేయడం మనందరి బాధ్యతగా భావించాలని అన్నారు. మన హక్కుల కోసం మనమంతా ఒకే వేదికపై నిలబడి, సమాజానికి మన ఏకతా శక్తిని తెలియజేయాలని ఆయన తెలియజేశారు.