భారత ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అమెరికా టారిఫ్‌లు విధిస్తున్న వేళ భారత ప్రధాని మోదీ జపాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జపాన్‌తో ప్రత్యేకమైన వాణిజ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రధాని పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆర్థిక సదస్సులో కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ షోరింజన్ దరుమాజీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆలయ ప్రధాన పూజారి దరుమా బొమ్మను బహుమతిగా ఇచ్చారు. జపాన్ సంప్రదాయంలో ఈ బొమ్మ పట్టుదలకు, అదృష్టానికి ప్రతీకగా చెబుతారు. ఈ బొమ్మ ఎవరి వద్ద ఉంటే వారికి మంచి జరుగుతుందని, అనుకున్న లక్ష్యాలను, చేపట్టిన పనులను పూర్తి చేస్తారని అంటారు. మరి ఈ దరుమాజీ ఆలయం గురించి విశేషాలను డివోషనల్ కేటగిరిలో ప్రచురిస్తాం. తప్పకుండా షోరింజన్ దరుమాజీ ఆలయం గురించి తెలుసుకోండి.