గూఢాచారిగా జీవితం గడపడం అంటే ఛావును మెడలో వేసుకొని తిరగడమే. అందులోనూ అమెరికా దేశంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేయాలంటే…దానికి ఎంత గుండెధైర్యం కావాలో చెప్పక్కర్లేదు. మగవాళ్లంటే సరే. కానీ, ఆడవాళ్లు ఇలా సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేయడం మామూలు విషయం కాదు. తన దేశం కోసం చంపడానికైనా, ఛావడానికైనా సరే సిద్ధంగా ఉన్నవాళ్లే ఇలాంటి పనులకు పనికివస్తారు. రష్యాకు చెందిన లేడీ జేమ్స్‌బాండ్‌గా గుర్తింపుపొందిన అన్నా చాప్‌మాన్ అమెరికాలో పలు సంవత్సరాలపాటు రష్యన్ గూడాచారిగా పనిచేసింది. పలు సీక్రెట్ ఆపరేషన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. టాప్ బిజినెస్‌మెన్‌లను ఆకర్షించి వారి నుంచి అమెరికాకు చెందిన కీలక సమాచారాన్ని రాబట్టడమే ఆమె పని.
ఈ పనిలో సక్సెస్ అయినా ఓ సందర్భంలో ఆమెను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. అయితే, గూఢాచారుల పరస్పర అప్పగింత సమయంలో ఆమె తిరిగి రష్యాకు వెళ్లిపోయింది. కాగా, ఇప్పుడు ఈ అందమైన గూడాచారికి పుతిన్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటిలిజెన్స్‌కు ఆమెను చీఫ్‌గా నియమించారు. గూడాచర్యంలో రష్యా సాధించిన విజయాలను తెలియజేసేదే ఈ మ్యూజియం.