రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ భారీ లిఫ్ట్ డ్రోన్ తయారీకి శ్రీకారం చుట్టింది. అన్‌మ్యాండ్ ఎయిరియల్ సిస్టమ్స్‌లో భాగంగా BTS VAB S-76ను రూపొందింది. ఇది కార్గో ట్రాన్స్‌పోర్ట్ కోసం రూపొందించిన తొలి హెవీ లిఫ్ట్‌గా అధికారులు చెబుతున్నారు. ఇది గరిష్టంగా 1500 కేజీల వరకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇది సైనికులను, ఆయుధాలను, వైద్య సామాగ్రిని, టెలికాం యూనిట్లను, రాడార్ పరికరాల లాజిస్టిక్స్‌ను లిఫ్ట్ చేయగలదు. అంతేకాదు, యుద్ధభూమిలో గాయపడిన సైనికులను అక్కడి నుంచి తరలించేందుకు ఈ కార్గో డ్రోన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టెస్టింగ్ దశలో ఉన్నది. ఈ టెస్టింగ్ సక్సెస్ అయితే, యుద్ధరంగంలో గణనాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కమర్షియల్‌గా వీటిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే… వేగం, మొబిలిటీ, ఖర్చు, లాజిస్టిగ్ విభాగంలోనూ గణణీయమైన మార్పులు వస్తాయి. వైద్యరంగంలో కూడా మార్పులు రావొచ్చు. ఇప్పటి వరకు రోగులను ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. కానీ, ఈ డ్రోన్లు అందుబాటులోకి వస్తే ఈజీగా ఎయిర్‌లిఫ్ట్ చేయవచ్చు. 1500 కిలోల వెయిట్ ఉండే వాహనాలను కూడా ఈ డ్రోన్ మోసుకెళ్లగలుగుతంది. అడవులు మంటల్లో చిక్కుకున్నప్పుడు నీటిని స్పింక్లింగ్ చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఫైర్ ఆపరేషన్లలోనూ ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. రిస్క్ ఫాక్టర్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. యుద్ధ వ్యూహాలు కూడా మారిపోతాయి. యుద్ధం కంటే శాంతి గురించే ఆలోచిస్తారు. పరిస్థితులు కూడా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.