శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్
తో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.



సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరి జవహర్‌లాల గారు, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు గారు, అదనపు పీసీసీఎఫ్ శ్రీమతి శాంతి ప్రియ పాండే గారు తదితరులు పాల్గొన్నారు.