విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
17 నెలల కాలంలో… చరిత్ర సృష్టించిన అయోధ్య రామాలయం
Spread the loveSpread the loveTweetజనవరి 22, 2024 – చరిత్రను మళ్లీ రాసిన రోజు! అయోధ్య…శతాబ్దాలుగా చర్చలతో, కోర్టు కేసులతో, ఆశలతో నిండి ఉన్న చోటు.ఈ పవిత్ర క్షేత్రంలో…
Spread the love
Spread the loveTweetజనవరి 22, 2024 – చరిత్రను మళ్లీ రాసిన రోజు! అయోధ్య…శతాబ్దాలుగా చర్చలతో, కోర్టు కేసులతో, ఆశలతో నిండి ఉన్న చోటు.ఈ పవిత్ర క్షేత్రంలో…
మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కూటమి ప్రభుత్వ లక్ష్యం – అప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweet•అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక•కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు•తమిళనాడు, కేరళల్లో విజయవంతమైన రీఫ్ కల్చర్,…
Spread the love
Spread the loveTweet•అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక•కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు•తమిళనాడు, కేరళల్లో విజయవంతమైన రీఫ్ కల్చర్,…