రాజకీయం వేరు..రౌడీయిజం వేరుగా”..
ఈ డైలాగ్” ఛత్రపతి”
సినిమాలో కోటాశ్రీనివాస్ అన్న డైలాగ్. “ఎన్నికలలో పని చేయడం వేరు…సాధరణ వేళల్లో పని చేయడం వేరు”
జిల్లాకు 33వ ఎస్సీగా ఈ నెల 15 వేతదీన బాధ్యతలు స్వీకరించిన ఏ.ఆర్.దామోదర్ పరిస్థితి అంతే.2019లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా ఎస్పీగా పని చేసిన కాలంలో ఫిబ్రవరి లో బాధ్యతలు తీసుకున్న దామోదర్ కు ఒక నెలలోనే అటు స్వారత్రిక ఎన్నికలు,ఇటు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో..ఆ మూడు నెలలో జరిగిన ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.సీన్‌కట్ చేస్తే అప్పుడు పని చేసిన ఎస్పీనే ప్రకాశం జిల్లా నుంచీ బదిలీపై జిల్లాకు వచ్చారు.బాధ్యతలు స్వీకరించిన క్షణమే జిల్లాలో పని చేసే అనుభవం ఉందని, జిల్లాలో రాజకీయం గురించి తెలుసునని విలేకరుల సాక్షిగా చెప్పకనే చెప్పారు.తానేంటో..తన పని తీరు ఏంటో..తనెలా పని చేస్తానో.గడచిన అయిదేళ్లు వైఎస్ఆర్పీపీ పాలన సాగింది.
ఇప్పుడు మూడు పార్టీల కలయకతో కూటమి పాలన ప్రభుత్వం కొనసాగుగోంది.పైపెచ్చు గంజాయి అక్రమ రవాణను సమూలనంగా రూపు మాపే పనిలో రాష్ట్ర హోం శాఖ దృష్టి పెట్టింది కూడ.ఇక జిల్లాలో చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా చెడ్డ పేరే మూటగట్టుకుంది..అదీ ఉగ్రమూలాలతో అరెస్ట్ కాబడిన ఆబాద్ వీధికి చెందిన సిరాజ్. ఎన్ఐఏ రాక,ఆపై విచారణ,వారంరోజుల పాటు పోలీస్ కస్టడీ,ఆ పై సెంట్రల్ జైల్ నుంచే వెబ్ కామ్ ద్వారా జిల్లా జడ్జి విచారణ,ఆ పై ఎన్ఐఐ కస్టడీకి అప్పగింత.ఇన్ని ఎపిసోడ్ లు విజయనగరం కేంద్రంగా ఉండి మరీ అపశ్యాతిని మూటగట్టుకుంది.ఇలాంటి తరుణంలో ఎస్పీ గా దామోదర్ బాధ్యతలు చేపట్టారు.ఇక శాఖా పరంగా ఒకరుకాదు ఇద్దరు కాదు నలుగురు సీఐలపై పలు కేసులలో ఎప్ఐఆర్ నమోదు కావడం మరో సంచలనం.అలాగే నిజాయితీగల ఇన్ స్పెక్టర్లు రాజకీయనేతల ఆదేశాలకు వీఆర్ లకువెళ్లే సంస్కృతి మూట కట్టుకుంది. సీఐ బదిలీలలో బాగంగా సర్దుబాటులో ఎస్పీకి రెండు కళ్లల్లా ఉండే ఇద్దరు ఇన్ స్పెక్టర్లలో గడచిన మూడు నెలలుగా ఒకే ఒక సీఐ తో నెట్టుకు రావడం జరుగుతోంది.ఇలాంటి సమస్యల నడుమ జిల్లా ఎస్పీగా దామోదర్ వచ్చారంటే ఈ విషయంలో కూటమి ప్రభుత్వ మార్క్ కచ్చితంగా ఉందనే సమాచారం ఇప్పటికై బయటకువచ్చింది.
రాజకీయ అండదండలు లేకుండా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ పని చేయరూ.ముందడగు వేయరు. బయటకు రాకుండా వాస్తవాలు రాని చెప్పని ఎస్పీలు ఎందరో. సీఐ స్థాయి నుంచీ ఎస్పీ స్థాయి వరకు వెళ్లిన,ఎదిగిన ప్రతీ ఒక్కరూ రాజకీయ అండదండలతోనే మార్క్ పాలన సాగించిన ఘటనలు కొకొల్లలు. అయితే జిల్లాకు ఉత్తరాంద్రలో చెప్పుకొదగ్గ,ఖ్యాతి ని పొందుతున్న శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర వచ్చే నెలలో జరగనుంది. రాష్ట్రంలో పేరెన్నిక,ఖ్యాతినొందిన జాతర గా భాసిల్లుతున్న పైడితల్లి పండగ నిర్వహణపై పోలీసుల ముందు ఎన్నో పలు సవాళ్లు కళ్లముందు కనిపిస్తున్నాయి.
విజయనగరం వాసి సిరాజ్ లాంటి వాళ్ల కదిలికలపై జరిగిన ఘటనలతోనైనా పోలీస్ శాఖ ఆపై బాస్ దృష్టి పెట్టాలి.ఎన్.ఐ.ఏ వచ్చి సిరాజ్ ను పట్టుకుంటే గాని బాంబు పేలుళ్ల క్రట కేసు బట్టబయలు కాలేదు. పోలీస్ శాఖకు ఈ కుట్ర కోణం చిన్నదే అయినా అందుకు పన్నాగం పన్నింది ఏ వర్గానికి చెందిన వ్యక్తి అన్నది ఆలోచించాలి.అదీ విజయనగరం ఆబాద్ వీధి వాస్తవ్యుడు,పైగా అతగాడు తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగి.ఈ విషయంలోనే గత ఎస్పీ ..ఉగ్రవాది తండ్రి అయిన పోలీస్ ఉద్యోగితో అరగంటసేపు మాట్లాడారంటే అతగాడి కుట్ర ఎంతమేరకు పోలీస్‌శాఖను కదిలించో చెప్పుకొవచ్చు.అయతే ఈ ఏడాది మే నెలలోఅరెస్ట్ అయిన సిరాజ్..సరిగ్గా ఈ అక్టోబర్ లో జరగనున్న పైడితల్లి అమ్మవారి జారత లో భారీ పేలుళ్లకు ప్రణాళిక చేసాడని తెలిసి ఎన్.ఐ.ఏ నే ఖంగుతింది. మరి ఇక్కడి పోలీస్ శాఖ పనితీరు అప్పుడే ఎలాఉంది విశదం చేసుకోవచ్చు.ఏతావాత జిల్లాలో పని చేసే అనుభవం కలిగి ఉన్న ఎస్పీ దామోదర్ ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలి.