భారతదేశపటంలో చుట్టుపక్కల దేశాలను చూపించినా చూపించకున్నా కన్యాకుమారికి కింద హిందూమహాసముద్రంలో కన్నీటి బొట్టు మాదిరిగా ఉంటే శ్రీలంకను ఖచ్చింతగా చూపుతారు. భారతదేశ పటంలో ఇలా ఎందుకు చూపుతారు అంటే చాలా మందికి తెలియదు. చూపించారు కాబట్టి చూస్తామని చెబుతారు. అసలు ఇలా చూపడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? యునైటెడ్ నేషన్స్ చట్టమే. యూనైటెడ్ నేషన్స్ సంస్థ 1958లో లా ఆఫ్ ది సీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం, ఒకదేశ సముద్ర సరిహద్దుకు 200 నాటికల్ మైళ్లు అంటే సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఏదైనా దేశం ఉంటే దానిని ఖచ్చితంగా మ్యాప్‌లో చూపించాలి.
ఈ చట్టం అమలు జరిగినప్పటి నుంచి భారతదేశం తన మ్యాప్‌లో శ్రీలంకను చూపుతూ వస్తున్నది. ఇంతకీ భారత్‌కు శ్రీలంకకు మధ్య దూరం ఎంతో తెలుసా? కేవలం 18 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే సుమారు 54.8 కిలోమీటర్లు. ఐక్యరాజ్యసమిని చట్టంలో చెప్పినట్టుగా 200 నాటికల్ మైళ్లలోపే ఉండటంతో భారత్ చట్టాలను గౌరవిస్తూ శ్రీలంకను మ్యాప్‌లో చూపుతూ వస్తున్నది. మరి ఈ నిబంధనను అన్నిదేశాలు పాటిస్తున్నాయా అంటే… అక్కడి దేశాలు వాటి ఇష్టాలను బట్టి చూపుతుంటాయి. కానీ, భారత్ చట్టాలను గౌరవిస్తూ శ్రీలంకను మ్యాప్‌లో చూపెడుతున్నది. ఇది మనకు చిన్నవిషయంగా మాత్రమే కనిపించినా… అంతర్జాతీయ చట్టాలను భారత్ ఏవిధంగా గౌరవిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.