ఆంక్షలు అవమానాలను ఎదుర్కొంటున్న ఏకైక దేశం North Korea. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ (Russia Ukraine War) మొదలై మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఈ యుద్ధం ముగియలేదు సరికదారెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌కు NATO Countries సహకారం అందిస్తుండటంతో రష్యా పలు దఫాలుగా హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలతో లాభం లేదని భావించిన రష్యా తన మిత్రదేశం North Koreaతో ఒప్పందం చేసుకొని సైన్యాన్ని రంగంలోకి దించింది. దీంతో యుద్ధం ఇప్పుడు కొత్తదారిలో పయనిస్తోంది. మరి ఈ యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.

North Koeaతో ఒప్పందం
కొరియా యుద్ధం (Korean War) తరువాత ఉత్తర కొరియాకు Russia మిత్రదేశంగా వ్యవహరిస్తోంది. ఆ దేశంతో సుదీర్ఘమైన సరిహద్దు కలిగిన North Koreaకు మాస్కో ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాకు రష్యా నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించడం పశ్చిమ దేశాలకు మింగుడు పడలేదు. రష్యాను ఒంటరిని చేయాలంటే రష్యా నుంచి విడిపోయిన దేశాలను నాటోలో చేర్చుకోవాలని భావించిన పశ్చిమ దేశాలు ఒక్కొక్కటిగా నాటోలో చేర్చుకోవడం మొదలుపెట్టాయి. రష్యా నుంచి విడిపోయిన దేశాల్లో పెద్ద దేశమైన ఉక్రెయిన్ కూడా నాటోలో చేరాలని నిర్ణయించుకోవడమే తాజా యుద్ధానికి కారణమైంది. 2022 లో ఈ యుద్ధం ప్రారంభం కాగా ఇప్పటి వరకు ముగియకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఉక్రెయిన్‌కు పలు దేశాలు సహాయ సహకారాలు అందిస్తుండటంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. అయితే, ఇప్పటి వరకు రష్యా ఒంటరిగా పోరాటం చేయగా, తాజాగా తన మిత్రదేశం ఉత్తరకొరియా కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.
Ukraineకు చుక్కులు చూపిస్తున్న North Korea సైన్యం
మిగతా దేశాల సైనికులకు విదేశాల్లో యుద్ధం చేసిన అనుభవం ఉండగా, North Koreaకు ఆ అనుభవం లేకపోవడంతో పాటు డ్రోన్ టెక్నాలజీ (Drone Technology) పై కూడా పెద్దగా పట్టులేకపోవడంతో యుద్ధంలో పాల్గొన్న తొలినాళ్లలో ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అయితే, కొద్దిరోజుల్లోనే కొరియా సైన్యం అనుభవం సంపాదించుకుంది. ఇప్పుడు వారు చేస్తున్న పోరాటానికి Ukraine సైన్యం బిత్తరపోతున్నది. ఎటునుంచి వస్తున్నారో తెలియకుండా హటాత్తుగా వచ్చి దాడులు చేస్తున్నారు. చంపు లేదా చావు ఈ నినాదంతోనే వారు యుద్ధం చేస్తున్నారు. ఉత్తర కొరియా సైనికుల వీరోచిత పోరాటం ఫలితంగా రష్యా కర్క్స్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఉత్తర కొరియా సైన్యం చేస్తున్న మెరుపు దాడుల నుంచి ఉక్రెయిన్ సైన్యం తప్పించుకోలేకపోతున్నది.
డ్రోన్ టెక్నాలజీ తెలియకున్నా పోరాటం
డ్రోన్ టెక్నాలజీ లేకున్నా సంప్రదాయక రీతిలో అత్యంత క్రమశిక్షణతో పోరాటం చేస్తున్నారు. లొంగిపోవడం అంటే దేశాన్ని వంచిండమే అనే నినాదం కిమ్ సైన్యంలో అణువణువునా నింపాడు. Kim ఇచ్చిన స్ఫూర్తితోనే కొరియా సైన్యం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నది. అవసరమైతే తన వద్ద ఉన్న 12 లక్షల మంది సైనికులను కూడా ఉక్రెయిన్‌ను ఓడించేందుకు వినియోగిస్తానని కిమ్ చెప్పడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సైన్యంతో పాటు ఆయుధాలను కూడా అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు కిమ్ ప్రకటించడం విశేషం. ప్యాంగ్యాంగ్ మాస్కో మధ్య బలం మరింత బలపడితే దాని వలన ప్రపంచానికి మరింత ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధానికి వీలైనంత త్వరగా ఫుల్‌స్టాప్ పెట్టాలని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.