శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు
ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పంచమి తిథి మ.12.03 వరకూ తదుపరి షష్టి తిథి, అనూరాధ నక్షత్రం రాత్రి 01.08 వరకూ తదుపరి జ్యేష్ట నక్షత్రం, ప్రీతి యోగం రా.11.46 వరకూ తదుపరి ఆయుష్మాన యోగం, బాలవ కరణం మ.12.03 వరకూ తదుపరి కౌలవ కరణం రా.01.16 వరకూ ఉంటాయి.
సూర్య రాశి : కన్యా రాశిలో ( ఉత్తర ఫల్గుణి 4 లో ఉ.07.06 వరకూ తదుపరి హస్త నక్షత్రం 1 లో).
చంద్ర రాశి : వృశ్చిక రాశి లో .
నక్షత్ర వర్జ్యం: లేదు
అమృత కాలం: మ.01.26 నుండి మ.03.14 వరకూ.
సూర్యోదయం: ఉ.06.0
సూర్యాస్తమయం: సా.06.08
చంద్రోదయం : ఉ.10.28
చంద్రాస్తమయం : రా.09.39
అభిజిత్ ముహూర్తం: ప.11.43 నుండి మ.12.31 వరకూ
దుర్ముహూర్తం: ఉ.06.06 నుండి ఉ.07.42 వరకూ.
రాహు కాలం: ఉ.09.06 నుండి ఉ.10.37 వరకూ
గుళిక కాలం: ఉ.06.06 నుండి ఉ.07.06 వరకూ
యమగండం: మ.01.37 నుండి మ.03.08 వరకూ.
ప్రతిమాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు అని, స్కంద షష్ఠి పేరుతో ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు.
నవరాత్రులలో ఈరోజు ఆరవ రోజు
నవ దుర్గా సాంప్రదాయం ప్రకారం భక్తులు ఈరోజు కాత్యాయనీ దేవిని పూజిస్తారు. వామన పురాణం ప్రకారం, మహిషాసురుడుని సంహరించడానికి దేవతల కోపాగ్ని కిరణాలన్నిటినీ ఋషి కాత్యాయునుడు ఒక క్రమ పద్దతిలో అమర్చి ఒక అభేధ్యమైన శక్తిని మహిషాసుర సంహారం కోసం తయారు చేశాడు. కాత్యాయునుడు తయారుచేసిన శక్తి కాబట్టి, ఆ శక్తికి కాత్యాయనీ అనే పేరు స్థిర పడింది. కాత్యాయనీ శక్తి మన శరీరంలోని ఆజ్ఞా చక్రాన్ని నియంత్రిస్తుంది. సౌరమండలం లో గురు గ్రహాన్ని ఈ శక్తి ప్రభావితం చేస్తుంది. తమ జాతక చక్రంలో గురు గ్రహ దోషాలు ఉన్న వారు ఈరోజు కాత్యాయనీ పూజ చేయడం వలన దోష నివృత్తి ని పొందుతారు.
నవ దేవీ సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు సరస్వతీ దేవి ని పూజిస్తారు.
విజయవాడ కనకదుర్గ దేవాలయం లో అమ్మవారిని ఈరోజు భక్తులు శ్రీ లలితా త్రిపుర సుందరి రూపం లో పూజిస్తారు.
దశ మహా విద్యల సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు త్రిపుర భైరవీ అమ్మవారిని పూజిస్తారు. దీర్ఘకాలిక విపరీత మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారు ఈరోజు త్రిపుర భైరవీ ఆరాధన ద్వారా త్వరగా స్వస్థత పొందుతారు.
అష్ట మాతృక సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు వారాహీ అమ్మవారిని పూజిస్తారు.
ఈరోజు బిల్వ నిమంత్రణ. ప్రామాణిక గ్రంధాల సూచనల ప్రకారం నవరాత్రులలో సాయంకాల సమయంలో షష్ఠీ తిథి ఉన్న రోజున బిల్వ నిమంత్రణ చేయాలి. దుర్గాదేవి ప్రాణప్రతిష్ట చేయడానికి ముందే బిల్వవృక్షాన్ని పరిశుద్దపరచి పూజించాలి.
నిరయణ రవి హస్తా నక్షత్రం లో ఈరోజు ఉదయం 07.06 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి హస్తా కార్తె ప్రారంభం అవుతుంది.