మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని, మార్కెట్‌లో పోటీని ఎదుర్కొంటూ పలు మోటార్ వాహన సంస్థలు కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో బాగంగా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపై దూసుకెళ్తున్నాయి. Fuel ధరలు అధికంగా ఉండటంతో వాహనదారులు Electric Vehicles వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, పూర్తిస్థాయిలో విద్యుత్ వాహనాలను తయారీ సంస్థలు డెవలప్ చేయడం లేదు. దానితో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను కూడా శోధిస్తున్నాయి. ఇలా వచ్చింది సీఎన్‌జీ వాహనం. ఇప్పటి వరకు కార్ల కోసం CNGని వినియోగించారు. ఇటీవలే Bajaj సంస్థ టూవీలర్ మోపెడ్ మోడల్‌లో సీఎన్‌జీ వెహికల్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు TVS మరో అడుగు ముందుకేసి స్కూటీ విభాగంలోనూ సీఎన్‌జీ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ స్కూటర్ ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
TVS Jupiter 125 CNG ఫీచర్స్

TVS అపాచీతో వాహానచోదకుల మనసును దోచుకున్న టీవీఎస్ సంస్థ స్కూటీ రంగంలోనూ ఆకట్టుకుంటోంది. ఈ విభాగంలో ఇప్పటికే TVS iQube Electric పేరుతో ఎలక్ట్రిక్ వెర్షన్ స్కూటీని విడుదల చేసి వావ్ అనిపించింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండటం విశేషం. కాగా, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి స్కూటీ విభాగంలోనూ సీఎన్‌జీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యూయల్‌తో పాటు సీఎన్‌జీ ట్యాంక్ కూడా ఇందులోనే ఇన్‌క్లూడ్ అవుతంది. భారత్‌లో జరుగుతున్న Bharat Mobility Expo 2025 లో TVS Jupiter 125 CNG స్కూటీని ఆవిష్కరించింది. 124.8 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ బై ఫ్యూయల్ ఇంజిన్ ఇందులో ఉండటం విశేషం. 7.2 హార్స్ పవర్‌తో సీవీటీ ఆటోమేటెడ్ గేర్‌బాక్స్ ఉండటం విశేషం. 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌తో పాటు, 1.4 కిలోల సామర్థ్యం గల సీఎన్‌జీ సిలిండర్ ఇందులో ఉంటాయి. పెట్రోల్ సీఎన్‌జీ సిలిండర్ రెండూ కలిపి 226 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాదు, ఇందులో ఎల్‌ఈడీ హెచ్‌లైట్, మొబైల్ చార్జింగ్ పోర్ట్, ఆల్ ఇన్ వన్ లాక్, సైడ్ లాక్ స్టాండ్, ఇండికేటర్ ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. అంతేకాదు, ఈ మొబిలిటీ ఎక్స్‌ఫోలో ఇథనాల్ వెర్షన్ జూపిటర్ స్కూటీని కూడా ఆవిష్కరించడం విశేషం.