ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న Maha Kumbhmelaలో వరసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి. కుంభమేళ ప్రారంభమైన సమయంలో టెంట్‌లోని సిలిండర్ పేలడం వలన దాదాపు 20 మంది వరకు మృతి చెందినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సంఘటన నుంచి బయటకు వచ్చి Maha Kumbhmela సాఫీగా జరుగుతోందని అనుకుంటున్న వేళ అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు మృతిచెందారు.

దీంతో కుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది ప్రభుత్వం. ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలకు అనుమతించబోమని, వీఐపీ పాస్‌లను మంజూరు చేయబోమని ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే మరోసారి అక్కడ ఏర్పాటు చేసిన ఓ టెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇలా వరసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. Maha Kumbhmelaలో భద్రతా వైఫల్యాలు కనిపిస్తున్నాయని కొందరు చెబుతుంటే, మరికొందరు ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఉగ్రవాద సంస్ధలేనని అంటున్నాయి.
Maha Kumbhmela ప్రారంభానికి ముందు భారత్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని సంస్థలు కుంభమేళలో అపశృతులు కలిగిస్తామని హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలను పోలీసు వ్యవస్థ ఏవిధంగా తీసుకున్నది. భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపైనే అందరి దృష్టి ఉన్నది. ఇప్పటి వరకు కేవలం మూడు రాజస్నానాలు మాత్రమే పూర్తయ్యాయి. మూడో రాజస్నానం మౌని అమావాస్యరోజునే తొక్కిసలాట జరిగింది. కాగా, ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి సందర్భంగా నాలుగో రాజస్నానం జరగబోతున్నది. వసంత పంచమి రోజున కూడా పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసు బలగాలకు కత్తిమీద సాములాంటిదే.
మరోవైపు ప్రత్యేక రాజస్నానాల సమయంలో నాగా సాధువులు, ఆయా అఖారాలకు చెందిన మహా మండలేశ్వర్‌లు తరలివస్తారు. ఒకేసారి వివిధ అఖారాలకు చెందిన నాగాసాధువులు తరలిరావడం, వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేచోట గుమిగూడటంతో అనుకోకుండా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కోట్లాదిమందిని ఒక క్రమపద్దతిలో పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించడం అంత సులభమైన వ్యవహరం కాదు. ఒకరుకాదు ఇద్దరు కాదు కోట్లాదిమంది ఒకేచోట స్నానం చేసేందుకు వచ్చే పవిత్రమైన కార్యం కావడంతో అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
1954 నుంచి పలుమార్లు జరిగిన కుంభమేళలో పలు సందర్భాల్లోనూ ఇలాంటి తొక్కిసలాటలు, అపశృతులే జరిగాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసినా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏంటి అన్నది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జరుగుతున్నవాటిని ఆపలేకపోతున్నారు. ఈశ్వరేచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుందని సర్ధుకుపోతున్నారు. భక్తులు, అధికార యంత్రాంగానికి మధ్య సన్నిహితం ఉంటేనే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా యాత్ర సాఫీగా సాగుతుంది. లేదంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా సానుభూతి ప్రకటించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.