మనసు బాగోలేనప్పుడు మనోహరమైన ఆలోచనలను గుర్తు చేసుకుంటాం. అందులో మధురమైన వాటిని, మనసుకు నచ్చిన వాటిని తలచుకొని ఆనందపడిపోతాం. వాటిని తలచుకుంటూ.. గుర్తుకొస్తున్నాయి…గుర్తుకొస్తున్నాయి అంటూ లీలగా పాటేసుకుంటూ ఊహల్లో విహరిస్తూ ఉండిపోయాం.
కొంతమందికి బాల్యంలో ఆడిన ఆటలు గుర్తుకొస్తాయి. పాడిన పాటలు మెదులుతాయి.. చేసిన అల్లరి అలజడి రేపుతుంది. ఇంకా కొంతమందికి బాల్యంలో వాడిన వస్తువులు గుర్తుకు వస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి కిరసనాయిల లాంతర. పత్తితో తయారుచేసిన వత్తిని క్యాంప్ లో ఎక్కించి కిరోసిన్ పోసి వెలిగిస్తారు. ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఎక్కడైనా ఇవే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అవి కేవలం ఆ తరం వారికి జ్ఞాపకాలుగా మాత్రమే నిలిపోయాయి. అలాంటి వస్తువులు ఎవరివద్దనైనా ఉంటే..వాటిని అలంకరణ వస్తువులుగా ఇంట్లో అలంకరించి పెట్టుకుంటున్నారు. లేదా స్టార్ రూమ్ లో పడేస్తున్నారు. ఈతరం వాళ్లు అటువంటి వస్తువులను ఇదిగో ఈ వీడియోలో చూపినట్టుగా చూసి ఆనందించడమే.