కేటీఎమ్ భారత మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త KTM 160 Duke మోడల్‌ను ప్రవేశపెట్టింది. స్పోర్టీ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ప్రీమియం టెక్నాలజీతో ఈ బైక్ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఇవ్వడం ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటివరకు హై ఎండ్ కేటీఎమ్ మోడళ్లకే పరిమితమైన ఈ ఫీచర్‌ను ఎంట్రీ లెవల్ బైక్‌లో అందించడం ద్వారా మార్కెట్లో తన ఆధిక్యతను చూపిస్తోంది.
ఈ TFT డిస్‌ప్లే ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల రైడింగ్ అనుభవం మరింత కంఫర్ట్‌గా, ఆధునికంగా మారనుంది. యమహా MT-15 V2 వంటి బైక్‌లతో పోటీ పడేందుకు ఈ అప్‌డేట్ కీలకంగా మారనుంది.
ఈ ఆలయం ముందు ఓడిపోయిన సునామీ… అమ్మవారే స్వయంగా దీపం వెలిగించిన ఆలయం
ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 164.2cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 18.74 bhp పవర్, 15.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో స్పోర్టీ రైడింగ్‌కు అనువుగా ఉంటుంది. 10.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, సూపర్ మోటో ABS, ఫుల్ LED హెడ్‌లాంప్స్, ముందు–వెనుక డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు భద్రతను పెంచుతాయి.
డిజైన్ పరంగా ఎలక్ట్రానిక్ ఆరంజ్, అట్లాంటిక్ బ్లూ, సిల్వర్ మెటాలిక్ మ్యాట్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో సుమారు ₹1.78 లక్షలు ఉండటం వల్ల, ఈ బైక్ యువ రైడర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.