Native Async

నోస్ట్రడామస్ భవిష్యవాణులు: నిజమేనా కేవలం అంచనానేనా?

Nostradamus Predictions Key Prophecies That Shocked the World & Their Accuracy
Spread the love

ప్రపంచం మొత్తం నమ్మే భవిష్యవాణి నోస్ట్రడామస్‌ చెప్పినవే. గత వందేళ్లుగా ఆయన చెప్పిన వాటిని ఆసక్తిగా గమనిస్తూ వస్తోంది. 16వ శతాబ్ధానికి చెందిన ఫ్రెంచ్‌ జ్యోతిష్యుడు, వైద్యుడు, రహస్యవాదిగా పేరుగాంచిన నోస్ట్రడామస్ భవిష్యత్తుపై చేసిన అద్భుతమైన అంచనాలు ఎందుకు ఇప్పటికీ చర్చనీయాంశం అవుతున్నాయి?

విపత్తులు, రాజులు, యుద్ధాలు, సహజ ప్రళయాలపై ఆయన చతుష్పదాల రూపంలో చేసిన అంచనాలు కొంతమంది ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఫ్రాన్స్‌ రాజు హెన్నీ II మరణం పై ఆయన అంచనా ఒకటి ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. యువసింహం గొప్ప సింహాన్ని ఓడిస్తుంది. కళ్లల్లో గాయాల కారణంగా మరణిస్తుంది. అని చెప్పాడు. దానిని 1519లో పేరుగాంచిన హెన్రీ II యుద్ధంలో కంటిగాయంతో మరణించాడు. నోస్ట్రడామస్‌ చెప్పినవిధంగానే జరిగిందని ఇప్పటికీ నమ్ముతారు.

అంతేకాక, 1666లో లండన్లో జరిగిన మహా అగ్నిప్రమాదం కూడా ఆయన చతుష్పదల్లో సూచనలుగా రాసినట్లు నమ్మవచ్చు: “ఇరవై మూడు ఆరు, మంచి వ్యక్తుల రక్తం లండన్లో ప్రవహిస్తుంది… ఇది లండన్ నగర అగ్నిప్రమాదానికి జోడింపుగా తీసుకువస్తారు. ఇక 20వ శతాబ్దంలో, అడాల్ఫ్ హిట్లర్, హిరోషిమా-నాగసాకి అణుదాడులు, జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య వంటి సంఘటనలను కూడా ఆయన చతుష్పదల్లో రాసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. “పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ, తన మాటలతో సైన్యాన్ని ఆకర్షిస్తాడు” అనే వర్ణన, హిట్లర్ పై సరిపోతుందనే నిపుణుల అభిప్రాయం.

నోస్ట్రడామస్ భవిష్యవాణులు ఎందుకు ప్రజల మనసులో నాటుకున్నాయి అంటే… అవి సంకేతాత్మకంగా, అర్థసహితంగా, విపత్తులు, సంఘటనలపై ప్రజలను ఆలోచింపజేయడం వలనే అంటారు. నిజంగా ఆయన చెప్పిన కొన్ని ఘటనలు సరిపోతున్నాయి, కానీ కొన్నింటి ఫలితాన్ని వెనుక తార్కిక, చరిత్రాత్మక వివరణలతో కూడా చూడాలి. అందుకే నోస్ట్రడామస్ భవిష్యవాణిని ప్రశ్నార్థకమైన మహానుభావంగా, ఇంకా ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *