మనం ఇప్పటికీ గ్రామాలకు వెళ్లే అక్కడ ఎంతో కాలంగా గ్రామాల్లోనే నివశించేవారు అండర్‌వేర్ కింద చారల నిక్కరు వేసుకుంటారు. అదే వాళ్లకు అండర్‌వేర్. ఈ చారల నిక్కర్లకు బొంతులు కట్టుకొని తిరుగుతుంటారు. పొలాల్లో పనిచేసేవారు కావడంతో కాళ్లు ఫ్రీగా ఉండాలి. బిగుతుగా వేసుకొని పనిచేస్తే దాని వలన ఇబ్బందులు వస్తాయి. అందుకే ఆరోజుల్లో చారల నిక్కరు పైన కండువా లేదా బనియను వేసుకొని పనులకు వెళ్లేవారు. అప్పట్లో వాటిని గ్రామీణ ప్రాంతాల్లో వేసుకునే దుస్తులుగా ముద్రపడింది. అలాంటి వాటిని ఆ తరం యువత ధరించేందుకు విముఖత వ్యక్తం చేసేది.
లాభాల కోసం కాదు…ప్రకృతిని ఆస్వాదించడం కోసమే రండి
కానీ, ఇప్పుడు ఆ చారల నిక్కర్లు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. బ్లూ, యెల్లో, గ్రీన్ రంగుల్లో ఉండే చారల నిక్కర్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. గ్రామాల్లో ఆయా ప్రాంతాల వరకు వేసుకొని తిరిగే నిక్కర్లు ఇప్పుడు విమానాశ్రయాల్లో, విదేశాల్లోనూ దర్శనం ఇస్తున్నాయి. బండ్లపై పది ఇరవై లేదా 100 రూపాయలకు దొరికే ఈ నిక్కర్లను ఇప్పుడు బ్రాండెడ్ పేరుతో 2500 నుంచి 11 వేల వరకు అమ్ముతున్నారు. గ్రామాల్లోని టైలర్‌కి చెప్తే సాయంత్రం వరకు ఓ 50 నిక్కర్లు కుట్టిపెడతాడు. వాటికి ట్యాగ్ తగిలించి ఆన్‌లైన్లో అమ్మేస్తే బోలెడు డబ్బులు. ఏమంటారు. నిజమే కదా.