వారమంతా కష్టపడి ఆదివారం రెస్ట్ తీసుకోవడం అలవాటుగా మారింది. ఆదివారం రోజున నిద్ర లేటుగా లేచి, ఎప్పటికో రెడీ అయ్యి, ఎప్పటికో తిని కాసేపు టీవీ ముందు లేదా పిల్లలతో ముచ్చటించే సరికి రాత్రి అవుతుంది. ఇంకేముంది నిద్రపోవడం… మరుసటి రోజు సోమవారం నుంచి పరుగులు… ఇదే జీవితంగా గడిచిపోతుంది కదా. ప్రతీరోజూ కాసేపు మనస్పూర్తిగా నవ్వితే శరీరంలో ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం వంటివి కంట్రోల్‌లో ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
కానీ, ఈ రోజుల్లో అంత నవ్వే ఓపికా, ఒకవేళా ఓపిక ఉన్నా నవ్వే సమయం ఉండదు. ఈ రెండూ ఉన్నా ఎలా నవ్వాలో, వేటిని చూసి నవ్వాలో తెలియదు. కామెడీ పేరుతో టీవీల్లో ప్రసారమయ్యేవి నవ్వు తెప్పించకపోగా వెగటు పుట్టిస్తున్నాయి. మరి నవ్వడం ఎలా… జంధ్యాల చెప్పినట్టుగా నవ్వేవాడు భోగి అయితే, నవ్వించేవాడు యోగి అవుతాడు. ఇదిగో ఈ లింక్ వీడియోలో మనకు నవ్వు తెప్పించే వీడియో ఉన్నది చూసి మనసారా నవ్వుకోండి. ఒకవేళ మనల్ని కూడా ఎవరైనా ఇలానే ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని మరింత ఎంజాయ్ చేయండి.