ఆపద ఎదురైతే ఎలా తప్పించుకోవాలో మనుషుల కంటే జంతువులకే బాగా తెలుసు. ఆపద ఎదురుకాగానే మనమైతే ముందు భయపడిపోతాం. ఆ భయంతో సమస్య మరింత జఠిలం అవుతుంది. సమస్యకున్న పరిష్కారం దూరంగా జిరిగిపోతుంది. తప్పించుకోలేక అక్కడే ఉండలేక సతమతమౌతాం. నానా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ, నేలపై నడిచే జంతువులు, నీటిలో సంచరించే చేపలకు ఏదైనా సమస్య ఎదురైతే ఎదుర్కొవడం వాటికి బాగా తెలుసు.
చైనా రష్యా మధ్య సరికొత్త ఒప్పందం… తెరుచుకున్న ఆర్కిటిక్ వాణిజ్యం
ఇదిగో ఇక్కడ ఈ వీడియో చూపినట్టుగా ఓ చేపకు ఎదురుగా పాము వస్తుంది. సాధారణంగా పాములకు చేపలు కనిపిస్తే అస్సలు వదలవు. గుటుక్కున తినేస్తాయి. కానీ, ఇక్కడ చేప తన తెలివిని ఉపయోగించి చనిపోయినట్టుగా వెల్లికలా పడుకుంటుంది. దీంతో ఆ పాము దాని పక్కనుంచే వెళ్లిపోతుంది. పాము వెళ్లిపోయిందని రూఢీ చేసుకొని, తుర్రుమని తప్పించుకొని వెళ్లిపోతుంది. ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.