నందమూరి బాలకృష్ణ అఖండ 2 ఎలాగో డిసెంబర్ 12th న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ కూడా ఆఫిసిఅల్ గా పరకటించారు… సో అటు ఫాన్స్ కూడా ఖుష్! కానీ ఎటొచ్చి ఈ వార్త ఒక్క రోషన్ కనకాల, డైరెక్టర్ సందీప్ కె కొంచం చేదు చేసింది… అరేయ్ ఏమైంది అంటే, వాళ్లిద్దరూ కష్టపడి చేసిన మౌగ్లీ సినిమా 12th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. కానీ అఖండ 2 కోసం పోస్టుపోన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
నెక్స్ట్ వీక్ పోదాం అంటే, ఆల్రెడీ క్రిస్మస్ ఇంకా జనవరి సంక్రాంతి డేట్స్ అన్ని ఫుల్! సో, నిన్న డైరెక్టర్ సందీప్ చాల డిస్స్పాయింట్ అయ్యి తన బాధ ని సోషల్ మీడియా లో పంచుకున్నారు. తన మొదటి సినిమా కలర్ ఫోటో కూడా కరోనా కారణంగా OTT లో రిలీజ్ అయ్యింది. అందుకే నాకు సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు చూసుకునే అదృష్టం లేదు అని బాధ పడ్డాడు.
కానీ ఈ బాధ కి ఒక సొల్యూషన్ దొరికింది… రోషన్ కనకాల హీరోగా నటించిన ఈ ప్రత్యేక ప్రేమకథ డిసెంబర్ 13న థియేటర్లలోకి రానుంది. చాలామందికి అనుమానం ఉన్నా – రిలీజ్ డేట్ డిసెంబర్ 12 కాదు… 13నే! అయితే టాలీవుడ్ ప్రేక్షకుల కోసం, అలాగే ఓవర్సీస్ ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు మాత్రం డిసెంబర్ 12నే ప్లాన్ చేశారు.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే అందమైన, హృదయాన్ని తాకే ప్రేమకథే మోగ్లీ 2025.
కొత్తగా విడుదల చేసిన రిలీజ్-డేట్ పోస్టర్‌లో రిలీజ్ డేట్ ఒక్క రోజు ముందుకు జరిగింది అంతే – ఈ కథ మొత్తం రోషన్ కనకాల, సాక్షి మాదోల్కర్, బండి సరోజ్ కుమార్ అనే ముగ్గురు పాత్రల చుట్టూనే తిరుగుతుందని.
ఈ సినిమా కోసం రోషన్ కనకాల నిజంగా చాలా కష్టపడ్డాడు. అడవిలో నడిచే యాక్షన్ సీక్వెన్సులు, అన్నింటికి ఆయన పర్ఫెక్ట్‌గా తన బాడీ ఇన్ ట్రాన్సఫార్మ్ చేసుకున్నాడు. కమెడియన్ హర్ష చెముడు కూడా ఈ కథలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బలంగా సపోర్ట్ చేస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన ప్రమోస్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అడవిలో మొదలైన ఈ ప్రేమకథ… డిసెంబర్ 13న ప్రేక్షకుల హృదయాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీగా ఉంది.