ఈ రోజు స్మార్త,మాధ్వ నిర్జల ఏకాదశి. భీమ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణము ప్రకారం, పాండవులలో రెండవవాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు,ఆకలికి తాళలేని వాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశీ అందరూ ఉపవాసం ఉంటుంటే, ఆకలికి తాళలేక తాను మాత్రం ఉండేవాడు కాదుట. గమనించిన వేద వ్యాసుడు, సంవత్సరంలో వచ్చే , 24 ఏకాదశీ ఉపవాసాలు ఆచరించక పోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని, ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే… సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుందని భీమసేనుడుకి నచ్చచెప్పి, ఉపవాసం ఉండేలా చేసాడుట. అందుకని ఈ ఏకాదశిని భీమసేనీ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్నీ ఏకాదశీ ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశీ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన, సంవత్సరంలో అన్నీ ఏకాదశీ వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ద్వాదశి హరి వాసరం రేపు ప.11.25 వరకూ ఉన్నందువలన ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు మ.01.34 నుండి సా.04.12 వరకూ ఉంటుంది.
Related Posts
విజయ్ సినిమా లో మమ్మీ విలన్…
విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమాకూ కాస్టింగ్ అప్డేట్స్ అంటే ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అంతెందుకు పూరి జగన్నాధ్ తో చేసిన ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్…
విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమాకూ కాస్టింగ్ అప్డేట్స్ అంటే ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అంతెందుకు పూరి జగన్నాధ్ తో చేసిన ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్…
దిల్ దియా ఫస్ట్ లుక్ చుస్తే షాక్ అవ్వాల్సిందే…
ఇప్పటి వరకు మనం తెలుగు లో సందీప్ రెడ్డి వంగ నే బోల్డ్ డైరెక్టర్ అనుకున్నాం… కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి ఫ్రెండ్ కూడా అలానే ఉన్నదే…
ఇప్పటి వరకు మనం తెలుగు లో సందీప్ రెడ్డి వంగ నే బోల్డ్ డైరెక్టర్ అనుకున్నాం… కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి ఫ్రెండ్ కూడా అలానే ఉన్నదే…
Ranveer Singh’s Dhurandhar 2 Trailer Will Be Out On This Date…
Dhurandhar… Now this movie has become the best patriotic movie of this year with its thrilling plot and amazing screen…
Dhurandhar… Now this movie has become the best patriotic movie of this year with its thrilling plot and amazing screen…