తుమ్మిపువ్వులు గడ్డిజాతికి చెందిన మొక్కలు. సాధారణంగా ఇవి రోడ్డు పక్కన, పొలం గట్లమీద పెరుగుతుంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ పువ్వులు మహాశివుడిని అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. ఈ తుమ్మి పువ్వులను భూతనాశక అని పురాణాలు చెబుతున్నాయి. ఇది చెడు శక్తులను తొలగించే శక్తి కలిగి ఉందని విశ్వాసం. ఈ పువ్వుల పేరుమీదగానే శివుడిని భూతనాధుడు అని పిలుస్తారు. భూతగణాలకు ఆయన అధిపతి. తుమ్మి పువ్వులు భూతగణాలను ప్రసన్నం చేస్తాయని, అందువలన శివుడి ఆరాధనలో వీటిని ఉపయోగిస్తారు. తుమ్మిచెట్టు శరీరాన్ని శుద్ధి చేసే తత్వాన్ని, రోగనాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. మహాశివుడు శుద్దతకు ప్రతీక. అందుకే ఈ పువ్వులు శివారాధనలో తప్పకుండా ఉపయోగించాలని అంటారు. శివుని పూజలు తుమ్మి పువ్వులను సమర్పించడం వలన దోషాలు తొలగిపోతాయి. చేసిన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అలంకరణ తత్వం లేని భగవంతుడు మహాశివుడు. అందుకే చిన్నదైన, సాధారణమైన తుమ్మిపువ్వును మహాశివుడిని శ్రద్ధతో సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతారని, భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఒక్క తుమ్మిపువ్వుతో శివుడిని పూజిస్తే సహస్ర పుష్పార్చన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts

Horoscope- ఏప్రిల్ 21, సోమవారం
🐏 మేషం (Aries) ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు. 🐂 వృషభం (Taurus) ఆర్థిక వ్యవహారాల్లో…
🐏 మేషం (Aries) ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు. 🐂 వృషభం (Taurus) ఆర్థిక వ్యవహారాల్లో…

తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత
తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరిగే అత్యంత ప్రసిద్ధి చెందిన జానపద దేవత ఉత్సవం. ఈ జాతర ప్రత్యేకతల వల్ల ఇది ఆంధ్రప్రదేశ్లోని…
తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరిగే అత్యంత ప్రసిద్ధి చెందిన జానపద దేవత ఉత్సవం. ఈ జాతర ప్రత్యేకతల వల్ల ఇది ఆంధ్రప్రదేశ్లోని…

మంగళవారం తిరుమలలో శ్రీవారి రోజువారి సేవల వివరాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రోజున జరిగే నిత్య సేవలు, ప్రత్యేక ఆరాధనలు మరియు భక్తులకు అందుబాటులో ఉండే దర్శన సమయాలు శాస్త్రీయ విధానంతో నిర్వహించబడతాయి. ఈ…
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రోజున జరిగే నిత్య సేవలు, ప్రత్యేక ఆరాధనలు మరియు భక్తులకు అందుబాటులో ఉండే దర్శన సమయాలు శాస్త్రీయ విధానంతో నిర్వహించబడతాయి. ఈ…