కంచి అనగానే గుర్తుకు వచ్చే దేవత కామాక్షిదేవి. కంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంచి కామాక్షిని దర్శించుకుంటారు. అయితే, అమ్మవారు ఆలయంలో ఐదు రూపాల్లో దర్శనం ఇస్తారని, ఈ ఐదు రూపాలనే పంచ కామాక్షి రూపాలు అని పిలుస్తారు. ఇందులో మొదటిది శ్రీ స్వయంభూ కామాక్షి రూపం. ఇది ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ రూపం. అమ్మవారు ఆలయంలో స్వయంభూవుగా అవతరించారని అంటారు. మూలవిరాట్ రూపంలోని అమ్మవారు యోగనిద్రలో ఉంటారు. ఇక రెండో రూపం శ్రీ ఊర్ధ్వ కామాక్షీ రూపం. ఓంకారాన్ని సూచిస్తూ తలను పైకెత్తిన రూపంలో కనిపిస్తారు. జ్ఞానం, ఆధ్యాత్మిక లోకారోహణకు సూచికంగా అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ కులకామాక్షిగా మూడో రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడి అమ్మవారిని శ్రీవిద్యా ఉపాసకుల కులదేవతగా పూజిస్తారు. అమ్మవారిని తంత్ర మార్గంలో పూజించే దేవతగా కొలుస్తారు. శ్రీ శ్రింగేరి కామాక్షి అమ్మవారిగా నాలుగో రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఆదిశంకరాచార్యుల ఆశీర్వాదంతో శ్రింగేరి శారదా పీఠంలో ప్రతిష్టించబడిన రూపాన్ని కామాక్షిదేవిగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని త్రిపుర సుందరి రూపంగా ఆరాధిస్తారు. శ్రీ విశాలాక్షి కామాక్షిగా ఐదోరూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారు విశాల దృష్టి కలదిగాను, అందరినీ అనుగ్రహించే దేవత రూపంలోనూ ఆరాధిస్తారు. ఈ ఐదు రూపాలను ఎవరైతే దర్శించుకుంటారో వారికి కామకోటి సిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కంచీపురంలో ఒకే చోట అమ్మవారి విభిన్నరూపాలు ఉండటం అరుదైన విషయాల్లో ఒకటిగా పండితులు చెబుతున్నారు.
Related Posts
ప్రదక్షిణలు ఎన్ని రకాలు…ఎలా చేయాలి
తిరుపతిలోనో, తిరువణ్ణామలైలోనో, ఒకదానికి ఒకటి భిన్నమైన ప్రదక్షిణా పద్ధతులు, భక్తుడి అంకితభావాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి. కానీ, ఈ ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, మన సనాతన…
తిరుపతిలోనో, తిరువణ్ణామలైలోనో, ఒకదానికి ఒకటి భిన్నమైన ప్రదక్షిణా పద్ధతులు, భక్తుడి అంకితభావాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి. కానీ, ఈ ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, మన సనాతన…
చైనా రష్యా మధ్య సరికొత్త ఒప్పందం… తెరుచుకున్న ఆర్కిటిక్ వాణిజ్యం
రష్యా – చైనా దేశాలు ప్రపంచ వాణిజ్య పటంలో ఒక చారిత్రాత్మక అడుగు వేశాయి. ఈ రెండు దేశాలు “నార్తర్న్ సీ రూట్” అభివృద్ధి కోసం ఒక…
రష్యా – చైనా దేశాలు ప్రపంచ వాణిజ్య పటంలో ఒక చారిత్రాత్మక అడుగు వేశాయి. ఈ రెండు దేశాలు “నార్తర్న్ సీ రూట్” అభివృద్ధి కోసం ఒక…
ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై పాక్ వైమానిక దళం దాడులు చేసిన కొన్ని గంటల్లోనూ ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు తెగబడింది. పాక్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి నుంచి…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై పాక్ వైమానిక దళం దాడులు చేసిన కొన్ని గంటల్లోనూ ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు తెగబడింది. పాక్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి నుంచి…