Native Async

జైలర్ 2 లో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్…

Nora Fatehi Roped in for Special Song in Rajinikanth’s Jailer 2, Shoot Underway in Chennai
Spread the love

రజనీకాంత్ – నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ సినిమా 2023లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాకు ప్రీ-రిలీజ్ హైప్ తీసుకొచ్చిన ప్రధాన కారణాల్లో ఒకటి తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ “కావాలా”. ఆ హై ఎనర్జీ నంబర్ యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న జైలర్ 2 కూడా ఓ స్పెషల్ సాంగ్‌తో అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతోంది.

జైలర్ 2లో స్పెషల్ సాంగ్ కోసం నోరా ఫతేహీని ఎంపిక చేశారు. బాలీవుడ్‌లో వరుసగా చార్ట్‌బస్టర్ స్పెషల్ నంబర్లతో క్రేజ్ తెచ్చుకున్న నోరా ఫతేహీ, బాహుబలి, టెంపర్, ఊపిరి, కిక్ 2 వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రస్తుతం ఆమె ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ పాట షూటింగ్ సుమారు ఎనిమిది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉండగా, రజనీకాంత్ కూడా ఈ సాంగ్‌లో పాల్గొననున్నారు.

నోరా ఫతేహీ తన కెరీర్‌లో దాదాపు 20 స్పెషల్ సాంగ్స్‌లో నటించిన ఏకైక భారతీయ నటి అని చెప్పొచ్చు. ‘దిల్‌బర్’, ‘ఓ సాకి ఓ సాకి’, ‘కుసు కుసు’ వంటి పాటలు ఆమెకు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తీసుకొచ్చాయి. హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని జైలర్ 2 మేకర్స్ ఆమెను ఈ స్పెషల్ నంబర్‌కు తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నోరా ఫతేహీ, రాఘవ లారెన్స్ హారర్ ఫ్రాంచైజీకి చెందిన కాంచన 4లో కూడా నటిస్తోంది.

జైలర్ 2 2026 జూన్‌లో విడుదల కానుందని రజనీకాంత్ కొద్ది నెలల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రజనీకాంత్, రమ్యకృష్ణ, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో కనిపించనుండగా, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, మిథున్ చక్రవర్తి క్యామియోలు కూడా ఉంటాయని సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ ఈ భారీ సీక్వెల్‌ను నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit