ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు కాకా ముందు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తారు అన్న దర్శకుల్లో సురేందర్ రెడ్డి పేరు కూడా ఉంది… ఆయనకు అప్పట్లో పవన్ నుంచి హామీ కూడా వచ్చింది… వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ చాలా కాలం క్రితమే జరిగింది. కానీ ఎన్నికల తరువాత పవన్ ఉప ముఖ్య మంత్రి అవ్వడం తో చాల బిజీ అయ్యారు.
అందుకే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ వంటి సినిమాల షూటింగ్స్‌ను యాక్టివ్‌గా మొదలుపెట్టడంతో, సురేందర్ రెడ్డి సినిమా కూడా ముందుకు వెళ్తుందనే అంచనాలు పెరిగాయి. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే… సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌తో చేయాలని అనుకున్న కథనే రవితేజతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారని, కిక్ తర్వాత ఈ త్రయం మళ్లీ కలవబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే, సురేందర్ రెడ్డి – రవితేజ సినిమా కథ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కోసం రాసిన అదే స్క్రిప్టా? లేక పూర్తిగా కొత్త కథా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. సై రా నరసింహ రెడ్డి, ఏజెంట్ వంటి సినిమాలు ఫ్లాప్స్ కావడంతో, సురేందర్ రెడ్డికి ఈ సినిమా చాలా కీలకంగా మారనుంది. ఈసారి తప్పకుండా బలమైన హిట్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంలో ఉన్నారని టాక్.