జాతకంలో అన్నిగ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ గ్రహమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటే దాని ప్రభావం జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బుధగ్రహం అనుకూలంగా లేకుంటే బుద్ధి, వ్యాపారం, విద్య, వాణిజ్యం, లావాదేవీల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్ణయాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచనలు అస్పష్టంగా ఉంటాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. పరీక్షల్లో విఫలం అవుతుంటారు. తెలివితేటలు క్రమంగా తగ్గిపోతుంటాయి. మాటల్లో తప్పులు దొర్లుతుంటాయి. అపార్థాలకు తావుంటుంది. సంబంధాల్లో విబేధాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాలు తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో మోసాలు జరుగుతాయి. బుధుడి అనుగ్రహం లేకుంటే నాడీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. మతిమరుపుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్మసంబంధిత వ్యాధులతో సతమతమౌతారు. బుధగ్రహ దోషాలను నివారించాలంటే ప్రతిరోజూ ఓం బ్రాం బ్రీం బ్రౌం సం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బుధవారం రోజున ఉపవాసం ఉంటూ పచ్చి మొక్కజొన్నను, పచ్చి కూరగాయలను దానం చేయాలి. బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించాలి. బుధవారం రోజున తులసిమొక్క దగ్గర దీపం వెలిగించాలి. వీలైనంత వరకు చదువుపై దృష్టిపెట్టాలి. ఏ విషయంపైనైనా సరే స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోవాలి.
Related Posts
శ్రీశైలంలో గౌరీదేవిగా భ్రమరాంబిక దర్శనం
శరన్నవరాత్రులలో ప్రతి రోజూ అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తారు. అందులో ఎనిమిదవ రోజు అమ్మవారి మహాగౌరి రూపం అత్యంత పావనమైనది. ఈ…
శరన్నవరాత్రులలో ప్రతి రోజూ అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తారు. అందులో ఎనిమిదవ రోజు అమ్మవారి మహాగౌరి రూపం అత్యంత పావనమైనది. ఈ…
OG కాన్సర్ట్ లో పవన్ కళ్యాణ్…
అబ్బా హైదరాబాద్ అంతా పెద్ద వాన… కానీ ఒక వైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్… ఇంకో వైపు పవన్ కళ్యాణ్ OG ట్రైలర్ ఇంకా కాన్సర్ట్ ఈవెంట్.…
అబ్బా హైదరాబాద్ అంతా పెద్ద వాన… కానీ ఒక వైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్… ఇంకో వైపు పవన్ కళ్యాణ్ OG ట్రైలర్ ఇంకా కాన్సర్ట్ ఈవెంట్.…