ఇప్పటికే దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న, చేతి నిండా సినిమా లతో బిజీ గా ఉంది… ఇంకా వరుసగా హిట్స్ కూడా కొడుతోంది! ఐతే ఇప్పుడు ఇప్పుడు ప్రేక్షకులను పూర్తిగా షాక్‌కు గురిచేసేలా ఒక అతి శక్తివంతమైన పాత్రతో ముందుకు వస్తోంది. ఆమె కెరీర్‌లోనే అత్యంత కోపం ఇంకా బలం తో నిండిన పాత్రగా తెరకెక్కుతున్న సినిమా ‘మైసా’
రావింద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఆయన డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమా. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ మొదలవుతూనే ఒక వాయిస్ ఓవర్‌తో మనల్ని కథలోకి లాగేస్తుంది. తన కూతురి ఆగ్రహం, ఆవేశం గురించి ఆమె చెప్పే మాటలు… “ఈ ప్రపంచం ఆమె పేరును గుర్తుపెట్టుకోవాలి” అనే స్టేట్మెంట్… సూపర్ గా ఉంది!

టైటిల్ పాత్ర మైసాగా రష్మిక చూపించిన ఎనర్జీ అన్‌స్టాపబుల్. పూర్తిగా ఆవేశంతో, అదరగొట్టింది. టీజర్ చివరిలో వచ్చే ఆమె రోర్… మైసా పాత్రలోని కోపం, బాధ, పోరాటాన్ని ఒక్క క్షణంలో బయటపెడుతుంది. అనుభవించిన బాధలతో, తట్టుకున్న అవమానాలతో, లొంగని మనస్తత్వంతో రూపుదిద్దుకున్న ఒక మహిళగా మైసా తెరపై నిలుస్తుంది.
దర్శకుడు రావింద్ర పుల్లే తన పవర్‌ఫుల్ రైటింగ్, రా అండ్ గ్రిట్టీ దర్శకత్వంతో టీజర్‌కు మరింత బలం చేకూర్చాడు. శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాలోని ముడి భావాలను అద్భుతంగా పట్టుకుంది. ఇక జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌ను మరింత పెంచుతూ ప్రతి ఫ్రేమ్‌ను ఉత్కంఠతో నింపుతుంది.
మొత్తంగా టీజర్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది… ‘మైసా’ రష్మిక మందన్న కెరీర్‌లో ఒక బోల్డ్ టర్నింగ్ పాయింట్.