మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పెద్ది సినిమా నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇక ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా మెగా అభిమానులకు పండగే! క్రిస్మస్ సందర్బంగా ఈ రోజు డైరెక్టర్ బుచ్చి బాబు సనా పెద్ది ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది అని పెద్ద న్యూస్ సోషల్ మీడియా లో షేర్ చేసారు!
ఇలా అప్డేట్ వచ్చిందో లేదో అలా వైరల్ అయ్యింది సోషల్ మీడియా లో!
ఈ సినిమాలో రామ్ చరణ్ తో జోడి గా జాన్వీ కపూర్ హీరోయిన్. ఇంకా శివ రాజ్ కుమార్, దివ్యేన్దు, జగపతి బాబు, సత్య, విజి చంద్ర శేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, పూర్తి village డ్రామా, అలానే చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించి, సర్పంచ్ జాన్వీ ని ప్రేమిస్తాడు. సో, స్టోరీలైన్ ఇంటరెస్టింగ్ కూడా ఉంది!
అలాగే సినిమా లోని “చికిరి చికిరి…” సాంగ్ సూపర్ హిట్ అయ్యి, 100M వ్యూస్ కూడా దాటేసింది!