2025లో ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షించిన నగరాలు టూరిజం ట్రెండ్స్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లాయి. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం సంస్కృతి, భద్రత, మౌలిక సదుపాయాలు, లైఫ్‌స్టైల్ అనుభవాల పరంగా పారిస్ మరోసారి నంబర్ వన్ డెస్టినేషన్‌గా నిలిచి తన ట్రావెల్ మ్యాజిక్‌ను చాటుకుంది. ఫ్యాషన్ షోస్, ఆర్ట్ గ్యాలరీలు, రొమాంటిక్ కేఫ్ కల్చర్‌తో పారిస్ ఎప్పటికీ ట్రావెల్ డ్రీమ్ సిటీగానే ఉంటుంది. రెండో స్థానంలో మాడ్రిడ్ తన చారిత్రక భవనాలు, ప్రపంచ స్థాయి ఆర్ట్ మ్యూజియంలు, స్ట్రీట్ ఫుడ్ వైబ్స్‌తో పర్యాటకులను ఆకట్టుకుంది.
సంప్రదాయానికి టెక్నాలజీని మిక్స్ చేసిన టోక్యో మూడో స్థానంలో నిలిచి ఫ్యూచరిస్టిక్ ట్రావెల్ అనుభూతిని అందించింది. ఓపెన్ మ్యూజియంలా కనిపించే రోమ్, ఫ్యాషన్ రాజధాని మిలన్, ఎప్పుడూ ఎనర్జీతో నిండిన న్యూయార్క్ కూడా టాప్ డెస్టినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. కాలువల అందంతో ఆమ్స్ట్రాడామ్, బీచ్ అండ్ ఆర్ట్ వైబ్స్ ఉన్న బార్సిలోనా, సేఫ్ అండ్ మోడ్రన్ సింగపూర్, K-పాప్ కల్చర్‌తో ట్రెండింగ్‌లో ఉన్న సియోల్… ఇవన్నీ 2025లో ట్రావెల్ డ్రీమ్స్‌ను నిజం చేసిన నగరాలుగా నిలిచాయి.