విడుదల ఆలస్యం కావడం, మిక్స్డ్ రిపోర్ట్స్ రావడం వల్ల నందమూరి బాలకృష్ణ ఎంతో హైప్‌తో వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సాధించలేకపోయింది. దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలకృష్ణకు ఇది నాలుగో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్న కానీ ఎందుకో బ్లాక్బస్టర్ అవ్వలేదు.
అయితే, సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో వీకెండ్స్ ఇంకా హాలిడేస్ సమయంలో మంచి ఆడియెన్స్ వస్తోంది.
మొదటి వీకెండ్‌లో సరైన కలెక్షన్స్ సాధించిన అఖండ 2, ఆ తర్వాత ఏ సెంటర్ల మల్టీప్లెక్సుల్లో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. కానీ మాస్ ఏరియాల్లో బాలకృష్ణకు ఉన్న ఇమేజ్ వల్ల బి, సి సెంటర్లలో మాత్రం సినిమా నిలబడగలిగింది. కొత్తగా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో, సింగిల్ స్క్రీన్స్‌లో మంచి ఆక్యుపెన్సీతో అఖండ 2 ఇంకా డీసెంట్ రెవెన్యూ రాబడుతోంది. రెండో వారంలో కూడా ప్రతి రోజు రూ.1 కోటి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది.

క్రిస్మస్ సెలవును ఉపయోగించుకుని గురువారం ఒక్కరోజే సినిమా రూ.2 కోట్లకు పైగా గ్రాస్ చేసింది. మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ.120 కోట్లకు చేరువగా ఉంది. రాబోయే వీకెండ్‌తో పాటు న్యూ ఇయర్ ఈవ్ సమయంలో కూడా సినిమా మంచి రన్ కొనసాగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయినా సరే, మోస్తరు రన్‌తోనే అఖండ 2 రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో వరుసగా ఐదవ సినిమా ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.