వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల దేవస్థానం భక్తి సంద్రంగా మారింది… ఆల్రెడీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబం తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ex-MLA రోజా సహా పలువురు మంత్రులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు.
నెక్స్ట్ సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, బాలకృష్ణ సతీమణి వసుంధర, నటుడు నారా రోహిత్ దంపతులు, హేమ, శివాజీ, శ్రీలీల, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, క్రికెటర్స్ తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.