టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని 66 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తన స్టైల్, ఎనర్జీతో యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను నాగ్ స్వయంగా వెల్లడించారు. తాను ఎప్పుడూ కడుపు మాడ్చుకునే డైటింగ్ చేయలేదని, సమతుల ఆహారంతో పాటు క్రమశిక్షణే తన బలం అన్నారు. దాదాపు 45 ఏళ్లుగా జిమ్‌ను మిస్ కాకుండా వెళ్తున్నానని, ఆరోగ్యం సహకరించని రోజులు తప్ప వ్యాయామం మానలేదని తెలిపారు. పాజిటివ్ ఆలోచనలే తన ఎనర్జీకి కారణమని చెప్పారు.

2025 ఏడాది తనకు కెరీర్, కుటుంబ పరంగా చాలా హ్యాపీగా ఉందన్నారు. హీరోగానే కాదు, పాత్ర నచ్చితే విలన్‌గా కూడా మెప్పిస్తున్న నాగ్ ప్రస్తుతం 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, అలవాట్లే ఆరోగ్య రహస్యమని నాగ్ చెబుతున్నాడు.