బీర్లు మంచినీళ్ల కంటే చౌకగా దొరికే దేశాలు ఉన్నాయంటే వినడానికి నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ఊహ కాదు, నిజం. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో బీర్ అనేది కేవలం ఆల్కహాలిక్ డ్రింక్ మాత్రమే కాదు, వారి లైఫ్‌స్టైల్‌లో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా వియత్నాం, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వియత్నాంలో రోడ్డుపక్కన చిన్న స్టాల్స్‌లో దొరికే “బియా హోయి” అనే లోకల్ బీర్ గ్లాస్ ధర కేవలం రూ.20 నుంచి రూ.30 మధ్యే ఉంటుంది.
ఆరు చోట్ల నాకా బందీ…న్యూ ఇయర్ ఆంక్షలు
కానీ అదే చోట ఒక సాధారణ మంచినీళ్ల బాటిల్ కొనాలంటే మరింత ఖర్చు అవుతుంది. కారణం ఏంటంటే… ఈ బీర్ స్థానికంగా అక్కడికక్కడే తయారు చేస్తారు, ప్యాకేజింగ్ ఖర్చులు ఉండవు, పన్నులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదే విధంగా చెక్ రిపబ్లిక్‌లో బీర్ తాగడం ఒక సంప్రదాయం లాంటిది. అక్కడ పబ్బుల్లో బీర్ ధర చాలాసార్లు నీళ్ల కంటే తక్కువగా ఉంటుంది. భారీ ఉత్పత్తి, వందల ఏళ్ల బ్రూయింగ్ అనుభవం వల్ల బీర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ధర చవకగా ఉందని మితిమీరి తాగడం మాత్రం ప్రమాదమే. ఈ వింత లైఫ్‌స్టైల్ వెనుక ఉన్న అసలు సందేశం ఏంటంటే… బాధ్యతతో ఆస్వాదించాలి అన్నదే.