మురారి: దర్శకుడి పై నమ్మకం తో ఆ సినిమా చేసిన మహేష్ బాబు…

Murari: The Film Mahesh Babu Did Trusting Director Krishna Vamsi
Spread the love

కృష్ణవంశీపై నమ్మకంతోనే మహేష్‌బాబు చేసిన సినిమా ‘మురారి’ … తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. మొదట ఈ కథను విన్నప్పుడు మహేష్‌బాబు, కృష్ణ ఇద్దరూ రిస్క్ అనిపించి తిరస్కరించారన్న విషయం చాలామందికి తెలియదు. శాపం, దైవత్వం, వరుస మరణాలు వంటి సీరియస్ అంశాలతో ఉన్న ఈ కథ అప్పటి మహేష్ ఇమేజ్‌కు సరిపోదేమోనని సందేహం.

నిర్మాతకూ కమర్షియల్ భయం వెంటాడింది. అయినా కథ మీద అపారమైన నమ్మకంతో కృష్ణవంశీ …“నన్ను నమ్మండి, తరతరాలకు గుర్తుండే సినిమా ఇస్తాను” అని ఇచ్చిన హామీనే టర్నింగ్ పాయింట్. ఆ నమ్మకమే ‘మురారి’గా రూపుదిద్దుకుంది. మణిశర్మ సంగీతం, సోనాలి బింద్రే గ్లామర్, మహేష్ సహజ నటన కలిసి ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా మార్చాయి. మహేష్‌ను నటుడిగా నిలబెట్టిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా 2025 డిసెంబర్ 31న రీ రిలీజ్ కావడం అభిమానులకు పండుగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit