మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రాబోయే సంక్రాంతి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీఎలెమెంట్స్ ఉన్న పూర్తి స్థాయి పండగ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.
అందుకే ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో నంబర్ 1 ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుని, 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోలందరిలోనూ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా నిలిచింది.
ఈ ట్రైలర్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకునేది చిరంజీవి హుషారైన, సింపుల్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన సహజ నటన, టైమింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర సినిమాకి అదనపు బలాన్ని ఇస్తోంది. చిరంజీవి – నయనతార జంట మధ్య కెమిస్ట్రీ కూడా ట్రైలర్‌లో బాగా వర్క్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి హాస్యభరిత పాత్ర, ఆయన ట్రేడ్‌మార్క్ మెగా స్వాగ్, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక హాజరు, అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మార్క్… ఇవన్నీ కలిసి ఈ సినిమాను పండగ సీజన్‌లో ప్రత్యేక హైలైట్‌గా నిలబెడుతున్నాయి.
ఈ సినిమాపై ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, రామ్ చరణ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చరణ్ ట్రైలర్‌ను కూడా షేర్ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్‌లో జరగనుంది. ఇక సినిమా 12th జనవరి న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం గా ఉంది!