మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామివారిని దర్శించుకున్న అనంతరం, శ్రీవారి ఆలయంలో ప్రెసిడెంట్ దంపతులు మూలవిరాట్టును దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు.

శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ తరఫున స్వాగతం పలికి ప్రెసిడెంట్ దంపతులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించబడినాయి.
రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించి, శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు.