కోలీవుడ్ లో వింత పరిస్థితి ఉంది ప్రస్తుతానికి… ఆల్రెడీ తలపతి విజయ్ లాస్ట్ సినిమా ‘జన నాయకన్’ పోస్టుపోన్ అవ్వడం తో అందరు షాక్ అయ్యారు. ఇక నెక్స్ట్ శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమా పైనే అందరి దృష్టి ఉంది…
ఎందుకు అంటే, ఈ సినిమాకు కూడా పరాశక్తి తరహా సెన్సార్ సమస్యలే ఎదురయ్యాయని టాక్. సీబీఎఫ్‌సీ కమిటీ సినిమా కోసం 23 కట్స్ సూచించిందని, ఫైనల్ సర్టిఫికెట్ ఈరోజే వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కొంత ఆలస్యం జరుగుతున్నందున ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. విడుదలకు కేవలం ఒక్కరోజే మిగిలి ఉండటంతో, చిత్రబృందం వీలైనంత త్వరగా సెన్సార్ వివరాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తిపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా లో శివ కార్తికేయన్ సరసన శ్రీలీల నటిస్తుంది పైగా ఇది ఒక పీరియాడిక్ డ్రామా కాబట్టి, హైప్ చాల ఉంది!