BR నాయుడు గారు ట్విట్టర్ ద్వారా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ట్విట్టర్ ద్వారా అధికారులందరికీ దహన్యవాదాలు తెలిపారు… టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి అని తెలిపారు…

🔹 రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం
🔹 టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93% భక్తులు సంతృప్తి
🔹 2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్యలో గణనీయ వృద్ధి
🔹 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం
🔹 44 లక్షల లడ్డూలు విక్రయం – గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికం
🔹 గతేడాదికంటే 27% అధికంగా అన్నప్రసాదాల పంపిణీ
🔹 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో అద్భుత అలంకరణలు
🔹 కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి
🔹 AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
🔹 ప్రణాళికాబద్ధ క్యూలైన్ నిర్వహణతో అంచనాలకన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించగలిగాం
ఈ వైకుంఠద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకూ, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.