ఒడియన్‌ మాల్‌లో తెలంగాణ సీఎం

Telangana CM Revanth Reddy Inaugurates AI-Integrated ODEON Mall in Hyderabad

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నూతనంగా నిర్మించిన ఓడియన్‌ (ODEON) మాల్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, ఏఐ ఇంటిగ్రేషన్‌తో రూపొందించిన ఈ మల్టీప్లెక్స్‌ నగర వినోద రంగానికి మరో మైలురాయిగా నిలవనుంది. సినిమా అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మాల్‌ దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *