ISPL సీజన్ 3 ప్రారంభోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక చక్కటి surprise అందింది… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ సూర్య— ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే వేదికపై కలిసి సందడి చేశారు.
ఒకే ఫ్రేమ్‌లో నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటూ కనిపించిన ఈ ముగ్గురు హీరోల దృశ్యం అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపింది. సోషల్ మీడియాలో ఈ క్షణాలు వైరల్ అవుతుండగా, ఇలా ముగ్గురు స్టార్స్ ని చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ISPL ప్రారంభ వేడుకకు ఈ స్టార్ల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.