వారఫలాలు – 2026 జనవరి 11 నుంచి 17 వరకు ఎలా ఉన్నాయంటే

Weekly Horoscope January 11 to January 17, 2026 – Zodiac Predictions, Remedies & Astrology Insights

మేష రాశి

ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు పనిభారం ఎక్కువగా ఉన్నా గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి మాటభేదాలు రావచ్చు.
పరిహారం: మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

వృషభ రాశి

ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో శుభవార్త వింటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
పరిహారం: శుక్రవారం లక్ష్మీదేవికి కమల పుష్పాలతో పూజ చేయండి.

మిథున రాశి

మనసు చంచలంగా ఉంటుంది. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: బుధవారం గణేశుడికి దుర్వా గడ్డి సమర్పించండి.

కర్కాటక రాశి

కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ మార్పు ఆలోచనలు వస్తాయి కానీ వాయిదా వేయడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు.
పరిహారం: సోమవారం శివాభిషేకం చేయండి.

సింహ రాశి

పదవి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
పరిహారం: ఆదివారం సూర్యనమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠించండి.

కన్య రాశి

పనిలో ఆలస్యం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మేలు చేస్తుంది. బాల్య స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది.
పరిహారం: బుధవారం విష్ణు సహస్రనామం పఠించండి.

తుల రాశి

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది.
పరిహారం: శుక్రవారం శ్రీమహాలక్ష్మీ అష్టోత్రం చదవండి.

వృశ్చిక రాశి

ఆర్థిక విషయాల్లో లాభాలు ఉన్నా అనవసర వివాదాలు రావచ్చు. మాటలపై నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందిరితోనూ మిత్రభావంతో మెలగాలి.
పరిహారం: మంగళవారం స్కందమాతను ప్రార్థించండి.

ధనుస్సు రాశి

విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్థులకు మార్పులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు.
పరిహారం: గురువారం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని పూజించండి.

మకర రాశి

బాధ్యతలు పెరుగుతాయి. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తీరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తొందరపాటుగా ఉండకూడదు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడకూడదు.
పరిహారం: శనివారం శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.

కుంభ రాశి

సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆశయాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాల్లో సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి.
పరిహారం: శనివారం రావిచెట్టుకు ప్రదక్షిణ చేయండి.

మీన రాశి

ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. మనోదైర్యంతో ముందుకు సాగుతారు. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది.
పరిహారం: గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణుపూజ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *