దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నయనతార పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత రెండు దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో నిలకడగా కొనసాగుతూ, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. సహజమైన నటన, ఆకట్టుకునే అందం, పాత్రకు తగ్గ గ్లామర్ – ఇవన్నీ కలిసి నయనతారను “లేడీ సూపర్ స్టార్”గా నిలబెట్టాయి. అంతేకాదు, దక్షిణాదిలోనే కాదు… దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలవడం విశేషం.
ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ సినిమా ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అని… సూపర్ ఉందని అందరు అంటున్నారు!
సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార… ఈసారి మాత్రం తన అలవాటుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. చిరంజీవి సినిమా కోసం ఆమె తన “నో ప్రమోషన్స్” రూల్‌ను బ్రేక్ చేసింది. షూటింగ్ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన క్రేజీ వీడియోలు, స్పెషల్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాతో సంబంధించి మరో హాట్ టాపిక్ ఏమిటంటే… నయనతార తీసుకుంటున్న పారితోషికం. నివేదికల ప్రకారం, ఈ చిత్రానికి ఆమె రూ.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇది మరోసారి ఆమె స్టార్ పవర్‌ను నిరూపిస్తోంది. కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం, చిరంజీవితో స్క్రీన్ స్పేస్ దృష్ట్యా ఈ రెమ్యునరేషన్ పూర్తిగా జస్టిఫై అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన నటించిన ‘జవాన్’ సినిమాతో నయనతార బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. ఆ చిత్రానికి ఆమె దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, మరోవైపు తమిళం, తెలుగు భాషల్లో పలు ఆసక్తికర చిత్రాలతో బిజీగా గడుపుతోంది. మొత్తంగా చూస్తే… నయనతార క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు, మరింత పెరుగుతూనే ఉంది.