పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సౌత్ లోనే కాదు… నార్త్ లో కూడా బలమైన మార్కెట్ ఉంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన సినిమాలు పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా సరే, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ మాత్రం గట్టిగానే రాబట్టేవి. కానీ తాజాగా విడుదలైన ‘ది రాజా సాబ్’ మాత్రం ట్రేడ్ అంచనాలను అందుకోలేక, నార్త్ ఇండియా మార్కెట్‌లో నిరాశపరిచే వసూళ్లతో మొదటి వీకెండ్‌ను ముగించింది.
హిందీ వెర్షన్‌లో ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ.6 కోట్ల నెట్‌తో ఓపెన్ కావడం ట్రేడ్‌కు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా సినిమా జోరు పెరగలేదు. నెగటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, అంతంతమాత్రమైన ఆన్‌లైన్ రివ్యూలు సినిమా వేగాన్ని పూర్తిగా తగ్గించేశాయి. శనివారం రోజున కలెక్షన్లు మరింత తగ్గి రూ.5 కోట్ల నెట్‌కే పరిమితమయ్యాయి. ఆదివారం నాటికి పరిస్థితి ఇంకా దారుణంగా మారి, మొదటి మూడు రోజుల్లో మొత్తం కలెక్షన్లు సుమారు రూ.15 కోట్ల నెట్ వద్దే నిలిచిపోయాయి. ఈ కీలక ఓపెనింగ్ వీకెండ్ ప్రభాస్ కెరీర్‌లోనే ఒక నిరాశకర అధ్యాయంగా మారింది.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఇది రెండో అతి తక్కువ ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రదర్శన ఆయన డిజాస్టర్ మూవీ ‘రాధే శ్యామ్’ కు దగ్గరగా ఉండటం గమనార్హం. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ హిందీ వెర్షన్ సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం రూ.75 కోట్ల నెట్ కలెక్షన్లు అవసరం. కానీ ఇప్పటివరకు వచ్చిన వసూళ్లను చూస్తే… ఉత్తర భారతంలో ఈ సినిమా భారీ లోటు దిశగా సాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలా సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్ ఉత్తర భారత మార్కెట్‌కు లేకపోవడం మరో పెద్ద మైనస్‌గా మారింది.
ఇంకా చెప్పాలంటే… ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోయినా కూడా ‘ది రాజా సాబ్’ హిందీ మార్కెట్‌లో ఆశాజనక వసూళ్లు సాధించలేకపోయింది. అదే సమయంలో ‘ధురంధర్’ సినిమా ఇంకా కొంత స్టీమ్‌తో నడుస్తుండటంతో, ప్రభాస్ సినిమాకు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం మరింత కష్టంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినప్పటికీ, మిక్స్‌డ్ టాక్ కారణంగా శనివారం, ఆదివారాల్లో భారీ డ్రాప్ నమోదైంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సీజన్ కారణంగా వసూళ్లలో పెద్ద బూస్ట్ వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఫెస్టివల్ హాలిడేస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముంది.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, జరినా వాహబ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… పండుగ సీజన్‌లో ఈ సినిమా ప్రభాస్‌కు ఎంతవరకు ఊరట ఇస్తుందన్నదే.