మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ విడుదలకు ముందే ఏర్పడిన భారీ బజ్కు పూర్తి న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. గ్రాండ్ ప్రీమియర్ షోలతో నిన్న రాత్రే సందడి మొదలైన ఈ సినిమా, ఇవాళ అధికారికంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది.
MSG అద్భుతమైన ఓపెనింగ్‌ను నమోదు చేసింది. మెగాస్టార్ కెరీర్లోనే అత్యంత బలమైన ప్రీమియర్ ఓపెనింగ్గా ఇది రికార్డ్ సృష్టించింది. బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే 2.87 లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, తొలి రోజు వసూళ్లు భారీ స్థాయిలో నమోదు కావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా $1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈ ఊపు మొదటి వారం మొత్తం కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంపూర్ణ కుటుంబ వినోదం, చిరంజీవి – వెంకటేష్ పవర్ఫుల్ కాంబినేషన్ ఈ సినిమాకు దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.