వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల చార్జీలు… బాబోయ్‌ సామాన్యుడు ఎక్కాలంటే కష్టమే

Vande Bharat Sleeper Train Fares Shock Passengers, Common Man Finds Travel Costly

బొగ్గుబండి నుంచి నేటి వందేభారత్‌ రైళ్ల వరకు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వందేభారత్‌ పేరిట రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ రైళ్లు కేవలం ఉదయం సమయంలో మాత్రమే ప్రయాణం కొనసాగిస్తాయి. రాత్రి 12 లోపే గమ్యస్థానాలకు చేరుకునేలా ప్లాన్‌ చేశారు. కానీ, ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు రాత్రి ప్రయాణాలు, దూర ప్రాంతాల ప్రయాణాల కోసం ప్రత్యేకించి తయారు చేశారు. పూర్తి ఎయిర్‌ కండీషన్‌తో నడిచే ఈ రైళ్లు ట్రాక్‌పై పరిగెత్తే రాజసౌధమనే చెప్పాలి. ఇందులో అన్నీ ఆటోమేటిక్‌ సిస్టమ్‌ ద్వారానే పనిచేస్తాయి. వ్యాక్యుమ్‌ టాయిలెట్స్‌, ఆటోమెటిక్‌ డోర్లు ఇలా అన్ని కూడా సిస్టమ్‌ ఆధారంగానే పనిచేస్తాయి.

ఈ సంక్రాంతి నుంచి తొలిరైలు అందుబాటులోకి వస్తున్నది. తొలి రైలు కోల్‌కతా నుంచి అస్సాం గౌహతికి ప్రయాణించనుంది. ఈ రైలుకు సంబంధించి టికెట్‌ వివరాలను కూడా రైల్వేశాక రిలీజ్‌ చేసింది. ఇందులో యావరేజ్‌ టికెట్‌ ధర రూ. 960 ఉంటుంది. అంటే 400 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవకాశం. ఇంత కన్నా తక్కువ దూరం ప్రయాణించాలన్నా కూడా ఇదే ధర చెల్లించాలి. ఇందులో మొత్తం మూడు క్లాసులు ఉంటాయి. ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌, థర్డ్‌క్లాస్‌ ఏసీ. గరిష్టంగా 3500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే సుమారు రూ. 13,300 చెల్లించాలి. ఈ చెల్లింపులన్నీ డిజిటల్‌ రూపంలోనే ఉండాలి.

ఈ రైళ్లో మనకు ఆర్ఏసీ సౌకర్యం ఉండదు. టికెట్‌ కన్ఫర్మ్‌ అయితేనే ప్రయాణం ఉంటుంది. ఒకవేళ టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే అమౌంట్‌ రిఫండ్‌ చేయడం కోసమే డిజిటల్ రూపంలోనే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. కిలోమీటర్‌ వారీగా తీసుకుంటే ఏసీ త్రీటైర్‌లో కిలో మీటర్‌ ప్రయాణానికి రూ. 2.4 ఉంటే, ఏసీ 2 టైర్‌లో కిలో మీటర్‌ ప్రయాణానికి రూ. 3.1గా ఉంటుంది. ఇక ఫస్ట్‌ ఏసీలో కిలోమీటర్‌కు 3.8 రూపాయలు చెల్లించాలి. క్యాబ్‌లతో పోలిస్తే ధర తక్కువే అయినా… సామాన్యులకు అందుబాటులో ఉంటుంది అనుకోవడం పొరపాటే. ఇక ఆరు నెలల ముందు నుంచి టికెట్‌లు బుక్‌ చేసుకునేందుకు రైల్వేశాఖ అవకాశం కల్పిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *