అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట… లాస్ట్ ఇయర్ అయన సినిమా ఏది రాలేదు కానీ, అంతకు ముందు ఇయర్ పుష్ప 2 చేసిన హడావిడి మాములుగా లేదు. మొత్తానికి ఏకంగా 1500 కోట్ల పైగా కలెక్షన్ సాధించి, దేశం లోనే అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమాల్లో రెండో ప్లేస్ లో నిలిచింది.
ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అంటారా??? అయ్యో… ఇంకా ఆ సినిమా విడుదల అవ్వాల్సిన దేశం ఉంది… ఎస్… ఈ సినిమా ఇప్పుడు జనవరి 16th న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. అందుకే అల్లు అర్జున్ తన భార్య స్నేహ ఇంకా కూతురు అర్హ తో కలిసి జపాన్ లో వాలిపోయాడు… అక్కడ మన పుష్ప రాజ్ కి చాల మంది ఫాన్స్ ఉన్నారు.

ఇక అల్లు అర్జున్ ఫామిలీ కి జపాన్ లో ఎలా గ్రాండ్ వెల్కమ్ లభించిందో మూవీ టీం సోషల్ మీడియా లో ఒక వీడియో రూపం లో చూపించింది… మీరు చూసేయండి:
అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో ఒక పాన్-వరల్డ్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్…