మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే కదా. ఆల్రెడీ ఫస్ట్ డే నే ఈ సినిమా 84 కోట్లు కాలేచ్ట్ చేసింది… ఇక ఈ రెండో రోజు ఏకంగా 100 కోట్లు దాటేసి, 120 కోట్ల మార్క్ ని చేరుకుంది…
ఈ విషయాన్ని నిర్మాతలు ట్విట్టర్ ద్వారా తెలియజెస్తు, మెగా ఫాన్స్ ని ఖుష్ చేసారు…
అలాగే నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇంకా నిర్మాతలు కూడా చాల చక్కగా మాట్లాడి, ఈ విజయం తమకి ఎంత ముఖ్యమో చెప్పారు. మన శంకర వర ప్రసాద్ సినిమా లో నటించిన చిన్నారులు, ఊహ ఇంకా బుల్లి రాజు కూడా సక్సెస్ మీట్ కి హాజరయ్యి అందరిని తమ మాటలతో ఇంప్రెస్స్ చేసారు.
మన శంకర వర ప్రసాద్ ప్రస్తుతానికి రిలీజ్ అయ్యి ఇంకా మూడు రోజులే అయ్యింది… రెండు రోజుల కలెక్షన్ తెలిసింది. ఇంకా పండగ ఈరోజే స్టార్ట్ అయ్యింది కాబట్టి, కలెక్షన్స్ ఇంకా చాల పెరగచ్చు అని, ఈ సినిమా కచ్చితంగా 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని అందరు అంటున్నారు!