KGF స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్ : ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్పందన అందుకుంటోంది. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని డార్క్ షేడ్ లుక్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ టీజర్‌లో యశ్ కంటే ఎక్కువగా లైమ్‌లైట్ దక్కించుకున్నది మాత్రం ఓ విదేశీ మోడల్. ఆమెనే బ్రెజిలియన్ మోడల్ బియాట్రిజ్ టాఫెన్‌బాచ్.
టీజర్‌లోని చిన్న గ్లింప్స్‌లో యశ్‌తో కలిసి బియాట్రిజ్ చేసిన ఇంటిమేట్ సీన్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా అన్‌సెన్సర్డ్ కట్ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, ఆ సీన్‌పై విమర్శలు భారీగా మొదలయ్యాయి. యశ్‌తో స్టీమీ సన్నివేశంలో కనిపించినందుకు బియాట్రిజ్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు, ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వివాదం బియాట్రిజ్ టాఫెన్‌బాచ్‌ను ఒక్కరాత్రిలోనే వైరల్ స్టార్‌గా మార్చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్లు, మెసేజ్‌లతో నిండిపోయినట్లు సమాచారం. కొందరు ఆమెపై ప్రశంసలు కురిపిస్తే, మరికొందరు తీవ్ర విమర్శలు చేశారు. ఈ అనవసరమైన అటెన్షన్, నెగటివ్ రియాక్షన్ నుంచి తప్పించుకోవడానికి బియాట్రిజ్ ఒక్కసారిగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసి, పూర్తిగా ఆన్‌లైన్‌కు దూరమైంది.
బియాట్రిజ్ టాఫెన్‌బాచ్ ఎవరు అనే క్యూరియాసిటీ కూడా అదే సమయంలో పెరిగింది. ఆమె బ్రెజిల్‌కు చెందిన మోడల్, నటి. 2014లో మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన బియాట్రిజ్, నటనతో పాటు సింగింగ్, డ్యాన్సింగ్‌లో కూడా శిక్షణ పొందింది. అంతర్జాతీయంగా యాక్షన్, గ్లామర్ ప్రాజెక్ట్స్‌లో ఆమె పని చేసిన అనుభవం ఉంది.
టీజర్ విడుదలైన వెంటనే ఆ విదేశీ నటి ఎవరు అనే ఊహాగానాలు మొదలవ్వగా, దర్శకురాలు గీతూ మోహందాస్ ఈ సస్పెన్స్‌కు తెరదించారు. గత వారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బియాట్రిజ్ టాఫెన్‌బాచ్‌ను అధికారికంగా పరిచయం చేశారు. అయితే టీజర్‌లోని అడల్ట్ సీన్ కారణంగా వివాదం చెలరేగిన కొద్ది రోజుల్లోనే బియాట్రిజ్ సోషల్ మీడియా నుంచి మాయమవడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా, టీజర్‌లోని ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్‌పై వచ్చిన ఫిర్యాదులపై సీబీఎఫ్‌సీ (CBFC) స్పందించింది. టీజర్ నేరుగా యూట్యూబ్‌లో విడుదలైందని, థియేటర్లలో ప్రదర్శించని కంటెంట్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం తమకు లేదని బోర్డు స్పష్టం చేసింది. తమ పరిధిలోకి రాని విషయాలపై చర్యలు తీసుకునే అవకాశం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.
టాక్సిక్ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుండగా, అదే రోజు ధురంధర్ పార్ట్ 2తో బాక్సాఫీస్ క్లాష్‌కు సిద్ధమవుతోంది.
మొత్తానికి… టీజర్‌తోనే సంచలనం సృష్టించిన టాక్సిక్, సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలు, వైరల్ చర్చలతో హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.