దక్షిణాది ప్రేక్షకులను తన సహజమైన నటనతో మంత్రముగ్ధులను చేసిన natural నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ ఎపిక్ ‘ది రామాయణం’తో భారీ స్థాయిలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె, ఆ సినిమా రిలీజ్త అయ్యే ముందే తన తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఈరోజు ‘ఏక్ దిన్’ సినిమా ఫస్ట్ టీజర్ విడుదలైంది. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్, హృదయానికి హత్తుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతోందని స్పష్టంగా చెబుతోంది. లీడ్ జంట ఇచ్చిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే విజువల్స్, మృదువైన సంగీతం టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునేది సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్సే.
సున్నితమైన భావోద్వేగాలతో తన ప్రేమను వ్యక్తపరిచే సాయి పల్లవి, టీజర్ మొత్తాన్ని తనవైపే తిప్పుకుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా, హృదయాన్ని తాకేలా ఉన్నాయి. టీజర్‌కు అసలు హైలైట్‌గా నిలిచింది సాయి పల్లవి హిందీ డబ్బింగ్. ఎలాంటి తడబాటు లేకుండా, పూర్తిగా సహజంగా ఆమె పలికిన డైలాగ్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.
మంచు కురిసే ప్రాంతాలు, అందమైన లొకేషన్లు టీజర్‌కు మరింత అందాన్ని జోడించాయి. కథ పరంగా ఇది ఒక సాధారణ బాలీవుడ్ రొమాంటిక్ స్లోవే స్టోరీ లా కనిపించినప్పటికీ, సాయి పల్లవి నటన మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించగా, స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా కలిసి కథను రూపొందించారు. మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్, అపర్ణ పూరోహిత్, బి. శ్రీనివాస్ రావు కలిసి ఈ సినిమాను సహనిర్మాతలుగా నిర్మించారు.